యువ ఐఏఎస్, ఐపీఎస్ ల బృందంతో డీజీపీ ఇంటరాక్ట్

ABN , First Publish Date - 2020-06-20T01:42:10+05:30 IST

యువ ఐఏఎస్, ఐపీఎస్ ల బృందంతో డీజీపీ ఇంటరాక్ట్

యువ ఐఏఎస్, ఐపీఎస్ ల బృందంతో డీజీపీ ఇంటరాక్ట్

అమరావతి: విధుల్లో చేరుతున్న 2018 బ్యాచ్ కు చెందిన 12 మంది యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బృందంతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయి మహిళ సంరక్షణ పోలీస్ మొదలుకొని ఉన్నతస్థాయి అధికారి వరకు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో డీజీపీ వివరించారు. పోలీస్ ఉద్యోగంలో ఎదురైయ్యే సవాళ్లు, రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పర్థితులెదురైనా అన్ని శాఖల సమన్వయంతో ముందుకుసాగాలని డీజీపీ సూచించారు. రాజకీయ పార్టీల భాగస్వామ్యం సమానంగా ఉంటుందని, ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని డీజీపీ అన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో డీజీపీ దిశానిర్దేశం చేశారు. యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి కొన్ని సందేహాలపై నివృత్తి చేసినట్లు డీజీపీ తెలిపారు.

Updated Date - 2020-06-20T01:42:10+05:30 IST