భక్తుల ఆగ్రహం.. నిర్ణయం మార్చుకున్న టీటీడీ

ABN , First Publish Date - 2020-09-06T15:05:52+05:30 IST

టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నట్లుండి సర్వదర్శనాలను నిలిపివేయడంతో అలిపిరి వద్ద భక్తులు ఆందోళనకు దిగారు.

భక్తుల ఆగ్రహం.. నిర్ణయం మార్చుకున్న టీటీడీ

తిరుపతి : టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నట్లుండి సర్వదర్శనాలను నిలిపివేయడంతో అలిపిరి వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. అసలేం జరిగిందంటే.. తిండి, నిద్ర లేకుండా భూదేవి కాంప్లెక్స్ ముందు రేపటి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే టీటీడీ ఉన్నట్లుండి సర్వదర్శనాలను నిలిపివేసింది. దీంతో సర్వదర్శనం టోకెన్లను ఆపివేసే విషయాన్ని రెండు రోజుల ముందే ప్రకటించక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కిలోమీటర్లు వచ్చిన తమకు దర్శనం కల్పించాలని, ఈ రోజు వరకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చి  ఆ తరువాత ఆపాలని భక్తులు డిమాండ్ చేశారు. దీంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్నవారి కోసం 3000 సర్వర్శనం టోకెన్లను జారీ చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఇక సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2020-09-06T15:05:52+05:30 IST