నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-12-01T20:09:15+05:30 IST
మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాకలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

కృష్ణా: మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం పినపాకలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట తుపాన్ల పాలవుతుందన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.