రాజ్‌భవన్‌లో కరోనా... సిగ్గు చేటు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-04-28T10:20:15+05:30 IST

‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు హేయం.

రాజ్‌భవన్‌లో కరోనా... సిగ్గు చేటు: దేవినేని ఉమా

అమరావతి, విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి):‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు హేయం. ప్రభుత్వ అసమర్థత, చేతగాని తనం కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడ సెంటర్‌లో జబ్బలు చరుచుకొని చాలెంజ్‌లు విసురుకునే సమయం కాదు. పింఛను, రేషను కావాలంటే ‘మా పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలి’ అంటూ సంతకాలు చేయండంటూ వలంటీర్లు బలవంతంగా సేకరిస్తున్నారంటే ప్రభుత్వ పైశాచికత్వం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 

Updated Date - 2020-04-28T10:20:15+05:30 IST