-
-
Home » Andhra Pradesh » Devineni Uma tweet on Jagan
-
మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-06-22T16:53:44+05:30 IST
అమరావతి: తమ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అమరావతి: తమ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 108 అంబులెన్స్‌ల కుంభకోణంలో బాధ్యులైన మీ పార్టీ నేతలు, బంధువులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ జగన్‌ను ప్రశ్నించారు.
‘‘తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని.. కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టాం. బాధ్యులైన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.