రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులేనా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-11-06T22:03:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇకపై రాష్ట్ర రహదారులలో ప్రయాణిస్తే ప్రజలపై టోల్ బాదుడు?, 35 రహదారులపై 45 నుంచి 60 కిలోమీటర్లకి

రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులేనా?: దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇకపై రాష్ట్ర రహదారులలో ప్రయాణిస్తే ప్రజలపై టోల్ బాదుడు?, 35 రహదారులపై 45 నుంచి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్?, 25 రూపాయలతో వసూలు మొదలు, రోడ్ల దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు, కేసులు, రాష్ట్రంలో "జగనన్న రోడ్డుకానుక" పథకం మొదలు పెడుతున్నారా అని అడుగుతున్న ప్రజలకు సమాధానం చెప్పండి జగన్‌ గారు’ అంటూ ట్విట్టర్‌లో దేవినేని ఉమ నిలదీశారు.



Updated Date - 2020-11-06T22:03:16+05:30 IST