ఏబీఎన్ ప్రతినిధిపై దాడిని ఖండించిన దేవినేని

ABN , First Publish Date - 2020-06-17T02:34:46+05:30 IST

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ నేతల దాడిని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. విలేకరిపై దాడి ఘటనపై ట్విట్టర్ ద్వారా

ఏబీఎన్ ప్రతినిధిపై దాడిని ఖండించిన దేవినేని

విజయవాడ: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ నేతల దాడిని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. విలేకరిపై దాడి ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ఎంపీ సమక్షంలో విలేకరిపై దాడి చేయడం దుర్మార్గం అన్నారు. విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. నాడు కియా ప్రతినిధులకు బెదిరింపులు, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీపై దాడికి యత్నం, నేడు మీడియాపై దాడి.. వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-17T02:34:46+05:30 IST