ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సవాల్‌కు దేవినేని ప్రతి సవాల్
ABN , First Publish Date - 2020-08-13T00:09:46+05:30 IST
నీ అవినీతి అక్రమాలపై మైలవరం నడిబొడ్డున కాదు.. తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్ వద్ద తేల్చుకుందామా

విజయవాడ: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సవాల్‌కు టీడీపీ నేత దేవినేని ఉమ ప్రతి సవాల్ విసిరారు. ‘‘నీ అవినీతి అక్రమాలపై మైలవరం నడిబొడ్డున కాదు.. తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్ వద్ద తేల్చుకుందామా?. ఫారెస్ట్ భూములను తవ్వే అధికారం ఎవరిచ్చారు? కమీషన్ కోసం బుడమేరు ముంపు భూములను కొనుగోలు చేయలేదా? నీలాంటి రాజకీయ వ్యభిచారులు సవాల్ విసరడం సిగ్గుచేటు. కొండపల్లి ఫారెస్ట్ భూముల్లో నీ బామ్మర్ది ఎంత దోచుకున్నాడో.. అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారో చెప్పాలి’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.