వైసీపీ దౌర్జన్యాలపై ఫైర్ అయిన దేవినేని

ABN , First Publish Date - 2020-09-01T16:50:45+05:30 IST

వైసీపీ దౌర్జన్యాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్నారు. నందిగామలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటా నవీన్‌ను దారుణంగా హత్య

వైసీపీ దౌర్జన్యాలపై ఫైర్ అయిన దేవినేని

విజయవాడ: వైసీపీ దౌర్జన్యాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్నారు. నందిగామలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన విలేకరి గంటా నవీన్‌ను దారుణంగా హత్య చేశారని, ఇప్పుడు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను పరిశీలించిన టీడీపీ నేత పట్టాభి రామ్ బృందంపై మైనింగ్ మాఫియా దాడికి తెగపడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగిస్తున్న వైసీపీ నేతలు పంచభూతాలను సైతం మింగేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల దోపిడీ, దౌర్జన్యాలపై ఏం చర్యలు తీసుకుంటారని సీఎం జగన్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-09-01T16:50:45+05:30 IST