పిరికి ప్రభుత్వం: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-06-23T22:36:24+05:30 IST

టీడీపీ కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు..

పిరికి ప్రభుత్వం: దేవినేని ఉమా

అమరావతి: టీడీపీ కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు ప్రభుత్వంపై కుట్ర చేశారని పేర్కొంటూ కేసులు పెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎంత పిరికితనంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సాక్షి పత్రిక, చానల్, వైసీపీ నాయకులు కలిసి నోటికొచ్చినట్లు టీడీపీ నేతలను తిట్టారని.. ఇవాళ పరిపాలన చేయాలని ప్రజలు అధికారం ఇస్తే... పరిపాలన చేయడం చేత కాక.. ఇటువంటి దాడులకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని ఆయన మండిపడ్డారు.


టీడీపీ నేత పట్టాభిరాం ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారని దేవినేని ఉమా అన్నారు. ఇలాంటి అక్రమాలు ఇక ముందు జరగకుండా చూడాలని పోలీస్ కమిషనర్‌ను కలుస్తామని చెప్పారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ను కలిసి ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అక్రమాలు, దోపిడీ,  ఇసుక, మైన్స్, ఇళ్ల స్థలాల పేరుతో భూములు తీసుకోవడం తదితర వాటిపై వివరించామన్నారు.

Read more