ఏజెన్సీలో ఆకలి కేకలు వినబడుతున్నాయా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-18T17:01:41+05:30 IST

అమరావతి: గోదావరి వరద ప్రవాహం గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతోందని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

ఏజెన్సీలో ఆకలి కేకలు వినబడుతున్నాయా?: దేవినేని ఉమ

అమరావతి: గోదావరి వరద ప్రవాహం గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతోందని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వందలాది గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయన్నారు. ‘‘గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతున్న గోదావరి ప్రవాహం, అంధకారంలో వందలాది గ్రామాలు, శిబిరాలకు వస్తేనే సాయమంటున్న ప్రభుత్వం, పిల్లలతో కొండల పైకి ఎక్కి టెంట్లలో ప్రజలు. ఏజెన్సీలో ఆకలి కేకలు. పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చి, వరద బాధితులను ఆదుకోమంటున్న చంద్రబాబు మాటలు వినపడుతున్నాయా?’’ అని జగన్‌ని ఉద్దేశించి దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


Updated Date - 2020-08-18T17:01:41+05:30 IST