ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన రామ్‌కు బెదిరింపులా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-18T14:45:08+05:30 IST

అమరావతి: రమేష్ హాస్పిటల్ 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన రామ్‌కు బెదిరింపులా?: దేవినేని ఉమ

అమరావతి: రమేష్ హాస్పిటల్ 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ట్విట్టర్ పోస్టు పెట్టినందుకు హీరో రామ్‌ పోతినేనికి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘32 ఏళ్లుగా 2 వేలకు పైగా సిబ్బందితో నెలకి 20వేల ఓపీ, 1500 పైగా ఇన్ పేషెంట్స్‌కి సేవలు. 1,25,000 పైగా cath, 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన రమేష్ హాస్పిటల్స్. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన రామ్‌కు బెదిరింపులా? ఎంతో మందికి ప్రాణదాత రమేష్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకంత ఉత్సాహం’’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-18T14:45:08+05:30 IST