కరోనా అదుపు తప్పిందన్న హెచ్చరిక మీకు కనబడుతోందా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-12T16:52:18+05:30 IST

అమరావతి: దేశంలో నమోదవుతున్న కేసుల్లో వందకు పది మంది ఆంధ్రులే ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

కరోనా అదుపు తప్పిందన్న హెచ్చరిక మీకు కనబడుతోందా?: దేవినేని ఉమ

అమరావతి: దేశంలో నమోదవుతున్న కేసుల్లో వందకు పది మంది ఆంధ్రులే ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఏపీలో కరోనా అదుపు తప్పుతోందన్న కోవిడ్ ఇండియా వెబ్‌సైట్ హెచ్చరిక మీకు కనబడుతోందా అని ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ ప్రశ్నించారు.


‘‘కేసులు రెండున్నర లక్షలకు చేరుకుంటున్నాయి, మరణాలు 2200 దాటాయి. ప్రపంచంలో ఏపీ ఘనత. దేశంలో వందకు పది మంది ఆంద్రులే, దేశంలో వైరస్ ఉధృతి.. జిల్లాలు 22 ఉంటే 13 ఏపీవే. 15 రోజుల్లో దేశంలో పెరుగుదల 0.42%, ఏపిలో50%. ఏపీలో కరోనా అదుపు తప్పిందన్న కోవిడ్ ఇండియా వెబ్‌సైట్ హెచ్చరిక మీకు కనపడుతుందా జగన్ గారు’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-12T16:52:18+05:30 IST