పెద్దల సభలో మంటలు.. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-06-18T14:45:42+05:30 IST
అమరావతి: నిన్న శాసనమండలిలో చోటు చేసుకున్న పరిస్థితులను ఊటంకిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: నిన్న శాసనమండలిలో చోటు చేసుకున్న పరిస్థితులను ఊటంకిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా? అని ప్రశ్నించారు. ‘‘పెద్దలసభలో మంటలు.. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి, తొడగొట్టిన మంత్రి, ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రి.. రాజ్యాంగ సంక్షోభం. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంకంటే రాజధానిమార్పు బిల్లే ముఖ్యమా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.