మద్య నిషేధం లేనట్లేనా?: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-12-11T19:06:30+05:30 IST

దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మద్య నిషేధం లేనట్లేనా?: దేవినేని ఉమ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘మద్యం ఆదాయంతో అప్పులు తీరుస్తామంటున్నారంటే మద్య నిషేధం లేనట్లేనా?, నిషేధం ఎత్తేస్తే ప్రజల మెడపై కొత్త పన్ను, రాష్ట్రాన్ని అమ్మైనా అప్పులు కట్టాల్సిందే అన్న షరతులకు అంగీకారం, అప్పుతెస్తున్న లక్షల కోట్లు ఎక్కడ ఖర్చుపెడుతున్నారు?, అప్పులు చేయడం, పన్నులు వేయడం తప్ప ఆదాయం సృష్టించే ఆలోచనలేదా?’’ అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-12-11T19:06:30+05:30 IST