రైతు సొమ్ము దుబారా దినోత్సవం చేయాల్సింది: దేవినేని

ABN , First Publish Date - 2020-07-09T02:42:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు దినోత్సవం కాదని, రైతు సొమ్ము దుబారా దినోత్సవం నిర్వహించి ఉండాల్సింది అని

రైతు సొమ్ము దుబారా దినోత్సవం చేయాల్సింది: దేవినేని

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు దినోత్సవం కాదని, రైతు సొమ్ము దుబారా దినోత్సవం నిర్వహించి ఉండాల్సింది అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఏం ఉద్దరించిందని రైతు దినోత్సవం నిర్వహిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. అధికారులు ప్రభుత్వానికి భజన చేయడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. సున్నా వడ్డీ పథకం జీవో ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఏడాది పట్టిందని దుయ్యబట్టారు. రైతుల సొమ్మును జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు.

Updated Date - 2020-07-09T02:42:34+05:30 IST