అమ్మఒడికి సవాలక్ష షరతులా?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-12-20T16:29:00+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి ఇవ్వాలంటే ప్రభుత్వం సవాలక్ష షరతులు పెడుతోందని వ్యాఖ్యానించారు.

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి ఇవ్వాలంటే ప్రభుత్వం సవాలక్ష షరతులు పెడుతోందని ఆరోపించారు. తెల్లరేషన్ కార్డు లింకుతో ఎనిమిది లక్షల మంది దూరమయ్యారని విమర్షించారు. వయసు, ఆధార్ అంటూ ప్రభుత్వం భారీగా కోతలు పెడుతోందని ప్రశ్నించారు. లక్షలాది మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల ముందు అందరికీ అమ్మఒడి అని చెప్పి.. నేడు ఆంక్షల సుడిలో నెట్టి నిలువునా మోసం చేశారని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.