ఎంతో కాలం మోసం చేయలేరు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-06-21T09:49:31+05:30 IST

‘‘అంకెల గారడీతో ప్రజల్ని ప్రభుత్వం ఎంతో కాలం మోసం చేయలేదు. పేద ప్రజలందరికీ అందే సంక్షేమ పథకాలలోనే మళ్లీ కులాల వారిగా విభజించి..

ఎంతో కాలం మోసం చేయలేరు: దేవినేని ఉమా

గొల్లపూడి, జూన్‌ 20: ‘‘అంకెల గారడీతో ప్రజల్ని ప్రభుత్వం ఎంతో కాలం మోసం చేయలేదు. పేద ప్రజలందరికీ అందే సంక్షేమ పథకాలలోనే మళ్లీ కులాల వారిగా విభజించి డబుల్‌ ప్రచారంతో సంక్షేమ మాయ చేస్తున్నారు’’ అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్‌ చేశారు. ‘‘కాపు సంక్షేమానికి ఘనంగా కేటాయించినట్టు చెప్పిన రూ.2,847 కోట్లలో రూ.2,400 కోట్లు అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలవే. రాష్ట్రంలో సామాన్యుడు ఇసుక కొరతతో ఇబ్బంది పడుతుంటే మీ పార్టీ నాయకుల ఇసుక దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందా సీఎం సారూ’’ అని ఉమా ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2020-06-21T09:49:31+05:30 IST