రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్న వైసీపీ నేతలు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-12-26T00:22:00+05:30 IST

వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్న వైసీపీ నేతలు: దేవినేని ఉమా

విజయవాడ:  వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా పేర్కొన్నారు. నియంతృత్వ చర్యలతో దేశవ్యాప్తంగా రాష్ట్రప్రతిష్ట దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. లోపాలున్నా, నిబంధనలు అంగీకరించకపోయినా చెప్పినట్లు చెయ్యాల్సిందేనా అని ప్రశ్నించారు. వ్యవస్థలను దెబ్బతీసేలా జరిగిన ఘటనలపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. హిందూ మత విశ్వాసాలపై వైసీపీ కుట్రపూరితంగా దాడి చేస్తోందని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని  ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని చెప్పారు. తిరుమల కొండపై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం టీటీడీ నిబంధనల ఉల్లంఘనే అని దేవినేని ఉమా పేర్కొన్నారు.

Updated Date - 2020-12-26T00:22:00+05:30 IST