ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా?

ABN , First Publish Date - 2020-09-05T09:08:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వ ఏడాది న్నర అవినీతి, అసమర్థ పాలనను ప్రశ్నిస్తే లారీలతో గు ద్దించి చంపుతామని ..

ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా?

కొడాలి నాని వ్యాఖ్యలపై దేవినేని ఆగ్రహం 


జి.కొండూరు, సెప్టెంబరు 4: వైసీపీ ప్రభుత్వ ఏడాది న్నర అవినీతి, అసమర్థ పాలనను ప్రశ్నిస్తే లారీలతో గు ద్దించి చంపుతామని బెదిరించడమేంటని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. మంత్రి కొడాలి నానిపై ధ్వజమెత్తారు. శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘రాజకీ య భిక్షపెట్టి రెండుసార్లు టిక్కెట్‌ ఇచ్చి ఆర్థికసాయం చే సిన చంద్రబాబు వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా దూషిస్తారా? నానీ.. నువ్వు గొంతు కేన్సర్‌ వచ్చి పోతావు’ అని శాపనార్థాలు పెట్టారు.  కొండపల్లి రిజర్వు ఫారెస్టులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కొండపల్లి బొమ్మలకు ఉపయోగించే తెల్లపొనికి చెట్లు నాశ నం చేసి అక్రమ క్వారీయింగ్‌ చేస్తూ పట్టుబడిన వాస్తవాలను బయటకు తెచ్చాననే అక్కసుతో బూతులు తిడు తూ చంపేస్తానని బెదిరిస్తున్నారన్నా రు. నాని వ్యాఖ్యల వెనుక సీఎం జగన్‌, సజ్జల రామ కృష్ణారెడ్డి, పోలీస్‌ వ్యవహారాలు చూస్తున్న ఇనగవరపు అవినా్‌షల కుట్ర ఉందన్నారు.


వారి నాయకత్వంలోనే నా ని ఇలా వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై డీజీపీ సుమో టోగా కేసు తీసుకోవాలని దేవినేని డిమాండ్‌ చేశారు. గతంలో జగన్‌ కనుసన్నల్లో పరిటాల రవి హత్య జరిగిం దన్నారు. ఆ కేసులో నిందితులను కూడా ఒక ప్రణాళిక ప్రకారం చంపేశారని, ఇప్పుడు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో వేసేందుకు 15 నెలలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. చావుకై నా సిద్ధమేకానీ ప్రశ్నించడం మానుకోనన్నారు. 

Updated Date - 2020-09-05T09:08:28+05:30 IST