భూసేకరణ పేరుతో వసూళ్లు: దేవినేని

ABN , First Publish Date - 2020-06-06T10:15:20+05:30 IST

‘‘భూసేకరణ పేరుతో వైసీపీ నేతలు కోట్లు వసూళ్లు చేస్తున్నారు. రూ.50 వేలు ఇస్తేనే పేదవానికి ఇంటి స్థలమా? అడిగితే బెదిరింపులు, దాడులు. వందల కోట్ల కుంభకోణం. చిన్న ఉద్యోగాలకూ లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదు’’

భూసేకరణ పేరుతో వసూళ్లు: దేవినేని

‘‘భూసేకరణ పేరుతో వైసీపీ నేతలు కోట్లు వసూళ్లు చేస్తున్నారు. రూ.50 వేలు ఇస్తేనే పేదవానికి ఇంటి స్థలమా? అడిగితే బెదిరింపులు, దాడులు. వందల కోట్ల కుంభకోణం. చిన్న ఉద్యోగాలకూ లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదు’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ‘‘బెయిల్‌ మీద ఉన్నారనే సంగతి మర్చిపోకండి. ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు. మీడియాను అణచివేయాలి చూస్తున్నారు. అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు తీర్పును తప్పుపట్టిన తమవారిని కాపాడుకుంటామని విజయసాయిరెడ్డి బాహాటంగా చెప్పారు. ఇలా చివరకు కోర్టులను కూడా బెదిరించాలని ప్రయత్నిస్తే ఏకంగా జైలుకే వెళతారు’’ అని రాజమహేంద్రవరం రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్‌మీట్లో హెచ్చరించారు.

Updated Date - 2020-06-06T10:15:20+05:30 IST