దుర్గగుడి అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు

ABN , First Publish Date - 2020-12-15T20:27:17+05:30 IST

ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది.

దుర్గగుడి అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు

విజయవాడ: ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లను ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌కు ధన్యవాద తీర్మానాన్నిపాలకమండలి ప్రవేశపెట్టింది. దుర్గగుడి అభివృద్ధి కోసం 90 కోట్ల ప్రతిపాదనలు పంపామని చైర్మన్‌ తెలిపారు. ప్రభుత్వం అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జనవరి 5 నుండి 9 వరకు భవాని దీక్షల విరమించాలని ఈవో సురేష్‌బాబు తెలిపారు. టైంస్లాట్ ప్రకారమే భవానీ భక్తులు రావాలని సూచించారు. నదిస్నానాలు, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల ఉండవని సురేష్‌బాబు ప్రకటించారు.


మరోవైపు డిసెంబర్ 17 నుండి 19  వరకు అర్ధమండల  మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం  6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి. 2021 జనవరి 5 నుంచి 9 వరకు మాలా విరమణ మహోత్సం జరుగనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభంకానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది. 

Updated Date - 2020-12-15T20:27:17+05:30 IST