అంబేడ్కర్ విదేశీ విద్యను ఎందుకు రద్దుచేశారు?
ABN , First Publish Date - 2020-10-27T08:38:38+05:30 IST
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక విధానం గురించి గొప్పలు చెప్తున్న సీఎం జగన్.. అంబేడ్కర్ విదేశీ విద్యను ఎందుకు రద్దు చేశారని ..

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యుడు దేవతోటి
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక విధానం గురించి గొప్పలు చెప్తున్న సీఎం జగన్.. అంబేడ్కర్ విదేశీ విద్యను ఎందుకు రద్దు చేశారని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యుడు దేవతోటి నాగరాజు ప్రశ్నించారు. ఈ పథకాన్ని నీరుకార్చి ఎస్సీ, ఎస్టీలకు విదేశీ విద్యను అందని ద్రాక్షగా చేశారని సోమవారం విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. దళితులపై దాడుల గురించి మాట్లాడని జగన్ దళిత పారిశ్రామిక విధానం గురించి మాట్లాడుతుండడం కంట్లో కారం కొట్టి నోట్ల చక్కెర పోసినట్లుగా ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక విధానం భేష్..
కాగా, ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడం అభినందనీయమని దళిత్ ఇండస్ర్టియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ పేర్కొన్నారు. ఆగస్టులో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో దళితులకు సబ్సిడీలు ఎత్తేయడంపై తమ సంఘం సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించడం హర్షణీయమన్నారు.