జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు: నాగరాజు

ABN , First Publish Date - 2020-08-12T14:52:59+05:30 IST

సీఎం పీఠం కోరికను నెరవేర్చిన దళితులకు జగన్ ప్రభుత్వంలో రక్షణ లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు విమర్శించారు.

జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు: నాగరాజు

అమరావతి: సీఎం పీఠం కోరికను నెరవేర్చిన దళితులకు జగన్ ప్రభుత్వంలో రక్షణ లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు విమర్శించారు. బాధితుల పక్కన నిలబడాల్సిన జగన్... వంచకుల పంచన చేరారని ఆరోపించారు. శిరోముండనం కేసులో దోషులకు శిక్ష పడలేదన్నారు. దళిత ఆడ బిడ్డలకు న్యాయం చేయలేని దిశ చట్టం ఎవరి కోసం.. ఏ కులం కోసం? అని ప్రశ్నించారు. రాజీ ప్రయత్నాలు చేస్తూ దళిత ద్రోహానికి ఒడిగట్టిన దళిత వైసీపీ నాయకులతో అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అగ్రకుల అహంకారం కోసం దళిత కుల అస్తిత్వాన్ని తాకట్టుపెడుతున్నారని నాగరాజు మండిపడ్డారు. 

Updated Date - 2020-08-12T14:52:59+05:30 IST