ఆ ప్రాంతాలన్నీ నేడు కన్నీళ్లు పెడుతున్నాయి: దేవతోటి నాగరాజు

ABN , First Publish Date - 2020-11-07T16:12:18+05:30 IST

అమరావతి: పాదయాత్ర పేరుతో జగన్ చేసిన వంచనకు మూడు ఏళ్లు పూర్తయిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు తెలిపారు.

ఆ ప్రాంతాలన్నీ నేడు కన్నీళ్లు పెడుతున్నాయి: దేవతోటి నాగరాజు

అమరావతి: పాదయాత్ర పేరుతో జగన్ చేసిన వంచనకు మూడు ఏళ్లు పూర్తయిందని టీడీపీ నేత దేవతోటి నాగరాజు తెలిపారు. పాదయాత్రకు, ఇప్పటికీ జగన్ రెడ్డి ప్రవర్తనలో ఎంత తేడా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల కోసం 9 లక్షల ఇళ్లు చల్లటి నీడను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ వాటిని ప్రజలకు ఇవ్వకుండా వైసీపీ నేతలు వికృత ఆనందం పొందుతున్నారన్నారు. జగన్ రెడ్డి పాదయాత్ర చేసిన ప్రతి ప్రాంతం ఈరోజు కన్నీళ్లు పెడుతోందన్నారు. అవి  తుడిచాకే వైసీపీ నేతలు పండగ చేసుకోవాలని దేవతోటి నాగరాజు తెలిపారు.


Updated Date - 2020-11-07T16:12:18+05:30 IST