ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: దేవతోటి
ABN , First Publish Date - 2020-12-13T15:47:04+05:30 IST
అమరావతి: ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని..

అమరావతి: ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మాత్రమే జరుగుతోందని టీడీపీ నాయకులు దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 మంది దళిత విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో అసువులు బాసి సాధించిన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. దళిత మేధావులు, ప్రజలు మౌనం వీడి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిలదీయాలన్నారు. లేకపోతే వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళిత జాతికి మనుగడ ఉండదన్నారు.
ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు సమంజసమేనా? అని ప్రశ్నించారు.