పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-24T07:42:02+05:30 IST

కర్నూలు జిల్లా పత్తికొండ శివారులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. పత్తికొండ

పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

పత్తికొండ, సెప్టెంబరు 23: కర్నూలు జిల్లా పత్తికొండ శివారులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. పత్తికొండ-గుత్తి ప్రధాన రహదారిలో రెండేళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రహదారిపై వెళ్లేవారు ఇక్కడ మొక్కులు తీర్చుకునేవారు. బుధవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు విగ్రహం ధ్వంసమై ఉండటాన్ని గమనించి పోలీసులకు తెలిపారు.


ఘటనా స్థలంలో క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. దుండగుల రక్తపు మరకలతోపాటు వేలిముద్రలను తీసుకుంది. పోలీసు జాగిలాలు సమీపంలోని కోళ్లఫారం వరకు వెళ్లి, తిరిగి వచ్చాయి. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ నాయకులు రంగాగౌడ్‌, పూనా మల్లికార్జున కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. విగ్రహాల ధ్వంసంపై విచారణకు ఆదేశించాలని డిమాం డ్‌ చేశారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 


Updated Date - 2020-09-24T07:42:02+05:30 IST