ఎక్సైజ్ అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి సీరియస్

ABN , First Publish Date - 2020-03-30T15:47:22+05:30 IST

అమరావతి: ఎక్సైజ్ అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సీరియస్ అయ్యారు.

ఎక్సైజ్ అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి సీరియస్

అమరావతి: ఎక్సైజ్ అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ తన కారులో అక్రమంగా మద్యం తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


త్రినాథ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించామన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా ఎక్సైజ్‌లో కొందరు అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. త్రినాథ్‌పై శాఖాపరమైన విచారణకు అదేశించామన్నారు. ఇలాంటి అక్రమాలు ఎవ్వరు చేసిన తీవ్ర చర్యలు తీసుకుంటామని నారాయణ స్వామి హెచ్చరించారు.

Updated Date - 2020-03-30T15:47:22+05:30 IST