విశాఖ ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల స్పందన

ABN , First Publish Date - 2020-07-14T17:19:12+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని ఫార్మా సిటిలో జరిగిన పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం..

విశాఖ ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల స్పందన

విశాఖపట్నం : జిల్లాలోని ఫార్మా సిటిలో జరిగిన పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని అదేశించారు.


ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి అదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు.

Updated Date - 2020-07-14T17:19:12+05:30 IST