‘రమ్మీ’ కోసం డిపాజిటర్ల సొమ్ము

ABN , First Publish Date - 2020-06-04T09:10:15+05:30 IST

ఆన్‌లైన్‌ జూదాలకు బానిసైన బ్యాంక్‌ చీఫ్‌ క్యాషియర్‌ తాను పనిచేస్తున్న బ్యాంక్‌కే కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా రూ.కోటిన్నర డిపాజిటర్ల సొమ్మును తన వ్యవసానాలకు వాడుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు పోలీసులు

‘రమ్మీ’ కోసం డిపాజిటర్ల సొమ్ము

  • నూజివీడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చీఫ్‌ క్యాషియర్‌ మోసం


నూజివీడు(కృష్ణా), జూన్‌ 3: ఆన్‌లైన్‌ జూదాలకు బానిసైన బ్యాంక్‌ చీఫ్‌ క్యాషియర్‌ తాను పనిచేస్తున్న బ్యాంక్‌కే కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా రూ.కోటిన్నర డిపాజిటర్ల సొమ్మును తన వ్యవసానాలకు వాడుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు పోలీసులు తెలిపిన వివరాలు.. నూజివీడులోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో హెడ్‌ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్రా రవితేజ ఆన్‌లైన్‌లో రమ్మీ, క్యాసినోలకు బానిసయ్యారు. ఈ నేపథ్యంలో 2017 నుంచి రమ్మీ, క్యాసినోలకు పెట్టుబడిగా బ్యాంకు డిపాజిటర్లకు చెందిన ఫిక్స్‌డ్‌ ఖాతాల నుంచి ఏకంగా రూ. 1,56,56,897లను విడతల వారీగా తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నారు. ఈ మొత్తాన్ని జూదానికి వాడేశారు. ఇదిలావుంటే, నూజివీడు బ్రాంచ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించిన నగదు లావాదేవీల్లో తేడా ఉన్నట్టు విజయవాడ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి రవితేజ మోసాన్ని బట్టబయలు చేశారు.

Updated Date - 2020-06-04T09:10:15+05:30 IST