డాక్టర్‌ సుధాకర్‌పై శాఖాపరమైన విచారణ

ABN , First Publish Date - 2020-12-30T08:34:52+05:30 IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌పై మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు.

డాక్టర్‌ సుధాకర్‌పై శాఖాపరమైన విచారణ

నర్సీపట్నం, డిసెంబరు 29: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎనస్థీషియన్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌పై మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. వైద్యులకు ఎన్‌-95 మాస్కులు తగినన్ని సరఫరా చేయడం లేదని వ్యాఖ్యానించినందుకు గాను ఈ ఏడాది ఏప్రిల్‌ 6న డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

 

డబ్బు, కారు తిరిగి ఇవ్వలేదు: డాక్టర్‌ సుధాకర్‌

ప్రభుత్వానికి చెడ్దపేరు తీసుకురావాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్‌-95 మాస్కులు లేవని మాత్రమే ఆ రోజు అన్నానని డాక్టర్‌ సుధాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన శాఖాపరమైన విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం మీదా తనకు వ్యతిరేక భావం ఉండదని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాదయాత్రలో సైతం పాల్గొన్నానని చెప్పారు.  విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద రహదారిపై జరిగిన సంఘటనలో తన కారును స్వాధీనం చేసుకుని ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఉంచేశారని,  తేల్చడం లేదని తెలిపారు.  

Updated Date - 2020-12-30T08:34:52+05:30 IST