ఆయనకు కరోనా రావడానికి పోలీసులే కారణం: దీపక్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-08-20T19:43:58+05:30 IST
పోలీస్ కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి పోలీసులే కారణమని..

అమరావతి: పోలీస్ కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి పోలీసులే కారణమని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో ఆయన మాట్లాడుతూ దీనికి డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. అనంతపురం, తాడిపత్రి డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలన్నారు. ఈ విధంగా శాడిజం చూపితే ప్రజలు హర్షించరన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహారశైలిముందు బ్రిటిష్ ప్రభుత్వ అకృత్యాలు కూడా దిగతుడిపేనని దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు.