ఎస్వీబీసీ పాలకమండలి నిర్ణయాలివే!

ABN , First Publish Date - 2020-11-07T01:58:30+05:30 IST

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ పాలకమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ నేతృత్వంలో నెల రోజుల పాటు కార్తీక

ఎస్వీబీసీ పాలకమండలి నిర్ణయాలివే!

తిరుమల: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ పాలకమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ నేతృత్వంలో నెల రోజుల పాటు కార్తీక మాస మహావ్రత దీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14 వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ఫిబ్రవరిలో ప్రారంభించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను హెచ్‌డీలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. రెండేళ్ల పాటు యాచేంద్ర ఈ పదవిలో కొనసాగనున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుతో సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుంచి సాయికృష్ణ యాచేంద్ర కుటుంబం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందువల్లే సాయికృష్ణ యాచేంద్ర ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమించారని జిల్లా వాసులు చెబుతున్నారు. 

Updated Date - 2020-11-07T01:58:30+05:30 IST