కురిచేడు ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-08-01T14:40:40+05:30 IST

ప్రకాశం: కురిచేడులో పలువురు శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది.

కురిచేడు ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

ప్రకాశం: కురిచేడులో పలువురు శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. కురిచేడులో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తూ శానిటైజర్ తాగి గుంటూరుకు చెందిన మాతంగి చినసుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శికి తరలించగా సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. మృతుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతదేహాల వద్ద డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-08-01T14:40:40+05:30 IST