కమీషనే లేదు... విరాళం ఎక్కడిస్తాం: డీలర్లు

ABN , First Publish Date - 2020-11-25T09:53:34+05:30 IST

గత ఐదు నెలలుగా కమీషన్‌ లేక నానా పాట్లు పడుతుంటే ఈ సమయంలో విరాళం ఇస్తామంటూ డీలర్లకు చెందిన ఓ సంఘం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించడం పట్ల రేషన్‌ డీలర్ల జేఏసీ

కమీషనే లేదు... విరాళం ఎక్కడిస్తాం: డీలర్లు

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గత ఐదు నెలలుగా కమీషన్‌ లేక నానా పాట్లు పడుతుంటే ఈ సమయంలో విరాళం ఇస్తామంటూ డీలర్లకు చెందిన ఓ సంఘం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించడం పట్ల రేషన్‌ డీలర్ల జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఈమేరకు జేఏసీ నేతలు లీలా మాధవరావు, ఎస్‌వీ రామారావు, కాగిత కొండ మంగళవారం శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విరాళం ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే తొలుత కమీషన్‌ బకాయిలు విడుదల చేసి దానిలోంచి మినహాయించుకోవాలని కోరారు. 


‘కినెటా’కు భూకేటాయింపు రద్దు

‘కినెటా పవర్‌’ సంస్థకు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో జరిపిన భూముల కేటాయింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. ప్రాజెక్టును స్థాపించడంలో ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 

Read more