పోలీసుల తీరు అప్రజాస్వామికం: దాసోజు
ABN , First Publish Date - 2020-08-23T01:38:06+05:30 IST
రాష్ట్రంలో పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని ఏఐసీపీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని ఏఐసీపీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీశైలం ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన రేవంత్‌ని దొంగలా బంధించారని ధ్వజమెత్తారు. డీజీపీని కలిసేందుకు వెళ్తే అక్కడా కాంగ్రెస్ నేత సంపత్‌ను అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రజా ఉద్యమాలను ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తాయని దాసోజు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని వ్యాఖ్యానించారు.