ప్రమాదకరంగా ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు

ABN , First Publish Date - 2020-08-17T00:07:42+05:30 IST

శబరి, గోదావరి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం చట్టి, వీరాపురం వద్ద రోడ్డుపైకి శబరి వరదనీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు

రాజమండ్రి: శబరి, గోదావరి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం చట్టి, వీరాపురం వద్ద రోడ్డుపైకి శబరి వరదనీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కల్లేరు వద్ద సీలేరు ఉధృతికి బ్రిడ్జి మునిగిపోయింది. ఒడిశా వైపు రాకపోకలు నిలిచిపోయాయి. పోలిపాక వద్ద రోడ్డు నీట మునిగింది. దీనివల్ల భద్రాచలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. టేకుబాక, ఉదయభాస్కర కాలనీ, గిన్నెల బజార్‌లో ఇళ్లలోకి వరదనీరు వచ్చింది. కోతులగుట్ట పునరావాస కేంద్రానికి వరద బాధితులను తరలించారు. వీఆర్‌.పురం మండలంలో వరద తాకిడికి లంకదీవులుగా గ్రామాలు మారాయి. శ్రీరామగిరి, వడ్డిగూడెంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దేవీపట్నంలో గిరిజన గ్రామాలు తొయ్యేరు, వీరవరం, మంటూరు, అగ్రహారం, పెనికిలపాడు నీట మునిగాయి. పోశయ్యగండి గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఇలాంటి పరిస్థితిలో పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

Updated Date - 2020-08-17T00:07:42+05:30 IST