ఒక్క డీఏకు ఓకే.. 5 విడతల్లో బకాయిలు

ABN , First Publish Date - 2020-10-08T07:23:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి....

ఒక్క డీఏకు ఓకే.. 5 విడతల్లో బకాయిలు

అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు  ఉద్యోగులకు ఒక డీఏ, పెండింగ్‌ జీతాలను 5 విడతల్లో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సీఎంవో అధికారులు తెలిపారని వివరించారు. గత మార్చి, ఏప్రిల్‌లో ఉద్యోగులకు 50 శాతం జీతాలను మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన 50 శాతం జీతాలను 5 విడతల్లో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని జగన్‌ తాజాగా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. చెల్లించాల్సిన డీఏ బకాయిల్లో కనీసం రెండు డీఏలు అయినా దసరాకు చెల్లించాలని జగన్‌ను కలిసి కోరనున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు 5 బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఒక డీఏకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మిగిలినవాటికి మోక్షమెప్పుడోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2020-10-08T07:23:09+05:30 IST