భయపెడుతున్న ‘అంఫన్’... సూపర్ సైక్లోన్‌గా మారే దిశగా...

ABN , First Publish Date - 2020-05-18T21:19:25+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారి, ఇప్పుడు సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ఈ క్రమంలో... కోస్తా తీరంలో భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.

భయపెడుతున్న ‘అంఫన్’... సూపర్ సైక్లోన్‌గా మారే దిశగా...

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారి, ఇప్పుడు సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ఈ క్రమంలో... కోస్తా తీరంలో భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. 


ఈ సాయంత్రానికి ఇది సూపర్ సైక్లోన్‌గా మారుతుందని హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ముందుకు సాగుతోందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను ఒడిశాలోని పారదీప్‌‌నకు దక్షిణంగా 790 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 940 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1,060 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.


మరో ఎనిమిది గంటల్లో... సూపర్ సైక్లోన్‌గా మారి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమ్ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య దిఘా, హటియా దీవుల వద్ద బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో పెను తుఫానుగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది. 

Updated Date - 2020-05-18T21:19:25+05:30 IST