విశాఖ పరవాడ ఫార్మాసిటీ సమీపంలో ప్రమాదం.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-06-17T02:25:02+05:30 IST
పరవాడ ఫార్మాసిటీ సింహాద్రి జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తగిలి కశింకోట చెందిన ...

విశాఖ: పరవాడ ఫార్మాసిటీ సింహాద్రి జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తగిలి కశింకోటకు చెందిన కూండ్రపు రోహిని నాయుడు 47 మృతి చెందారు. ఫీడరు మారుస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. మృతుడు విద్యుత్ శాఖలో రోజువారికూలిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు