వైసీపీ కార్యాలయంలో నోట్ల కట్టలు

ABN , First Publish Date - 2020-03-15T08:40:56+05:30 IST

విశాఖపట్నంలోని ఓ వైసీపీ నేత కార్యాలయంలో అవిశ్రాంతంగా డబ్బులు లెక్కిస్తున్న యంత్రాలివి. ఈ లెక్కల తతంగం ఇప్పుడు సోషల్‌ మీడియాలో...

వైసీపీ కార్యాలయంలో నోట్ల కట్టలు

విశాఖపట్నంలోని ఓ వైసీపీ నేత కార్యాలయంలో అవిశ్రాంతంగా డబ్బులు లెక్కిస్తున్న యంత్రాలివి.  ఈ లెక్కల తతంగం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నాయకుడి కార్యాలయంలో డబ్బులెక్కిస్తుండగా ఎవరో వీడియో తీసి.. పోస్టు చేశారు. కార్పొరేటర్లుగా పోటీచేసేవారు.. ఒకటి, రెండు కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని నేతలు చెప్పడంతో సమర్థులంతా డబ్బును నేతల కార్యాలయాలకు చేర్చారు. ఆ డబ్బును లెక్కించే పనిలో నేతల కార్యాలయ సిబ్బంది ఇలా బిజీగా ఉన్నారు. 

- ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం

Updated Date - 2020-03-15T08:40:56+05:30 IST