చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
ABN , First Publish Date - 2020-08-20T20:11:29+05:30 IST
లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకున్నాయి.

ఏలూరు: లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకున్నాయి. పంట పొలాలు చెరువులను తలపించే విధంగా మారిపోయాయి. నిడదవోలు మండలం విద్యుత్‌పురలంక గ్రామంలో వరి, కంద, అరటి తోటలు పూర్తిగా మునిగిపోయాయి. పంటలు నీట మునిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, తమకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు వస్తున్నారు.. వెళుతున్నారుతప్ప తమకు ఎలాంటి సహాయం అందడంలేదని రైతులు చెబుతున్నారు.