స్థానికంపై సంకటం

ABN , First Publish Date - 2020-10-24T08:14:22+05:30 IST

స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది.

స్థానికంపై సంకటం

ఎన్నికల నిర్వహణలో ఇబ్బందేమిటని ఎస్‌ఈసీని ప్రశ్నించిన హైకోర్టు

నాడు కరోనా ఉన్నా ఎన్నికలకు హడావుడి

ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కసరత్తు

28న పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలంటున్న విపక్షాలు

సర్కారు గొంతులో పచ్చి వెలక్కాయ!

నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలకు విముఖత


కరోనా కల్లోలంతో మార్చిలో ఆగిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలవుతుందా? అయితే... దానిని ఆగిన చోటి నుంచే కొనసాగిస్తారా? లేక...  కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, నామినేషన్లు స్వీకరిస్తారా? అప్పుడు ఎన్నికల వాయిదాపై కస్సుమన్న  సర్కారు పెద్దలు... ఇప్పుడు వాటి నిర్వహణకు సహకరిస్తారా? ఎన్నెన్నో ప్రశ్నలు! ఎన్నికల నిర్వహణలో ఇబ్బంది ఏమిటని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను ప్రశ్నించింది.   దీనిపై ఉత్కంఠను రేకెత్తిస్తూ... ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌  28వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.  వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ... ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని కోరే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ మాత్రం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీకాలం ముగిసేదాకా స్థానికం ఊసెత్తే అవకాశం కనిపించడంలేదు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సమావేశంలో వైసీపీయేతర పక్షాలన్నీ గత ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎస్‌ఈసీని నిలదీసే అవకాశముంది. ఎన్నికల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిషికేషన్‌ ఇవ్వాలని విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కమిషనర్‌ కేంద్రానికి రాసిన లేఖలోనే చెప్పారని గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేయడం అనివార్యమని రా జ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మళ్లీ కొత్త నోటిఫికేషన్‌ జారీకి అధికార పార్టీ సిద్ధంగా లేదని.. అంతేగాక నిమ్మగడ్డ ఆ పదవిలో ఉన్నంతవరకు ఎన్నికలు జరపరాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను ఆయన ఏకపక్షంగా వాయిదావేశారని సీఎం జగన్‌, మంత్రులు, వైసీపీ నేతలు ఆయనపై అప్పట్లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.


తర్వా త ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన పదవీకాలాన్ని కుదించి సాగనంపడం.. కొత్తగా మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను కమిషనర్‌గా నియమించడం.. తర్వాత హైకోర్టు సదరు ఆర్డినెన్స్‌ను, జీవోలను కొట్టివేయడం.. సుప్రీంకోర్టు కు వెళ్లినా చుక్కెదురు కావడంతో నిమ్మగడ్డను పు నర్నియమించడం విదితమే. వచ్చే ఏడాది మార్చి వరకు ఎన్నికలు రాకుండా చూసుకోగలిగితే.. అప్పటికి ఆయన పదవీకాలం పూర్తవుతుందని.. తర్వా త కొత్త కమిషనర్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు కానిచ్చుకోవాలని జగన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


ఈ నేపఽథ్యంలోనే ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో కమిషనర్‌ ఈ నెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం ని ర్వహిస్తుండడంతో ప్రభుత్వానికి గొంతులో వెలక్కా య పడినట్లయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నా రు. ఎన్నికల నిర్వహణపై వైఖరి చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. 


కాలం చెల్లిన ఆర్డినెన్స్‌..

సర్పంచ్‌ ఎన్నికలపై ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో ప్రభుత్వం ఇ టీవల మరోసారి ఆర్డినెన్స్‌ జారీచేసింది. గత అ సెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టరూపమిచ్చేందుకు బిల్లు తెచ్చింది. ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొం దినా, శాసనమండలిలో వీగిపోయింది. దరిమిలా అదే ఆర్డినెన్స్‌ను రెండోసారి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం ఆర్డినెన్స్‌ను ఒకసారే తీసుకురావలసి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.


‘ఒక ఆర్డినెన్స్‌కు సవరణ చేయడం, అదే ఆర్డినెన్స్‌ను మరోసారి తీసుకురావడం చట్టవిరుద్ధం. దీంతో అప్పట్లో తెచ్చిన ఆర్డినెన్స్‌ మురిగిపోయినట్లే..!  దాని ఆధారంగా తీసుకొచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ ఎలా చెల్లుతుంది’ అని ప్రశ్నిస్తున్నారు.  




ఇన్ని అక్రమాలను ఎలా ఆమోదిస్తారు..?

కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌ ప్రకటించడంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, స్పీకర్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, నేత లు పలు రకాలుగా స్పందించారు. కమిషనర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం హైకోర్టును, సు ప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా కోడ్‌ను మా త్రం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నియమావళి అమల్లో లేకపోవడంతో అభ్యర్థులను ప్రలోభపెట్టే పనిలో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారని, కొన్ని చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.


కోడ్‌ అమల్లో లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఆగడాలు శ్రుతిమించాయని, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. నా మినేషన్‌ పత్రాలు చించివేయడం.. అధికారులను, పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించడంపై ఇప్పటికే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాయి. బీజేపీ నేతలు గవర్నర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లారు. సాక్షాత్తూ కమిషనర్‌ నిమ్మగడ్డే అప్పట్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అక్రమాలను ఏకరవు పెట్టారు.


గతం లో ఎప్పుడూ లేని విధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవం అయిన తీరు, ముఖ్యంగా కడప, పులివెం దులలో ఓటు పడకుండానే ఏకగ్రీవాలు అవడం, చిత్తూరు, గుంటూరుల్లో జరిగిన అక్రమాలను తెలియజేశారు. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడంతో హిం సాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని స్పష్టం చేశారు. ఇన్ని అక్రమాలు జరిగాయని కమిషనరే అంగీకరించినప్పుడు.. నాటి ఎన్నికల ప్రక్రియను ఎలా ఆమోదిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్డు కూడా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అవకాశం లేనందున ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను కూడా ఎస్‌ఈసీ రద్దుచేసే అవకాశముందని అంటున్నారు.


Updated Date - 2020-10-24T08:14:22+05:30 IST