డబ్బులిస్తేనే దహన సంస్కారాలు

ABN , First Publish Date - 2020-08-01T22:13:54+05:30 IST

డబ్బులిస్తేనే దహన సంస్కారాలు

డబ్బులిస్తేనే దహన సంస్కారాలు

కరీంనగర్: ‘వైద్యో నారాయణ హరి’ అని ఏ సందర్భంలో అన్నారో కానీ.. ఇందుకు పూర్తి భిన్నంగా వైద్యులు వ్యవహరిస్తున్నారు. కరోనా ప్రజలకు శాపంగా మారితే... ఆసుపత్రుల యాజమాన్యాలకు మాత్రం వరంగా మారింది. రోగి బతికున్నప్పుడు లక్షల రూపాలయలు వసులు చేసే ఆసుపత్రి యాజమాన్యాలు చనిపోయినప్పడు కూడా కాసుల కోసం మానవత్వాన్ని మరిచిపోతున్నారు. కరీంనగర్ పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గోదావరిఖనికి చెందిన యాట శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం కరోనాతో సివిల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ శనివారం మృతి చెందాడు. అయితే 25వేలు ఇస్తేనే దహన సంస్కారాలు చేస్తామని ఆసుపత్రి సిబ్బంది కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. అయితే డబ్బుల్లేవని మృతుడు శ్రీనివాస్ భార్య అన్నపూర్ణ కన్నీరుమున్నీరైంది. అయినా ఆసుపత్రి యాజమాన్యం కనికరించలేదు. ఈ సన్నివేశం పలువురిని కంటతడి పెట్టించింది.

Updated Date - 2020-08-01T22:13:54+05:30 IST