వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం మద్దతు

ABN , First Publish Date - 2020-05-17T21:02:35+05:30 IST

వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం నేతలు మధు, బాబూరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం

వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం మద్దతు

విజయవాడ: వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. వలస కార్మికులు ఆందోళనకు సీపీఎం నేతలు మధు, బాబూరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం అనుమతి రాలేదనే రైలు రద్దు చేసినట్లు మధు తెలిపారు. 3 రోజుల్లో పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని మధు చెప్పారు. వలస కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేదని బాబురావు విరుచుకుపడ్డారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపమంటే పోలీసులతో కొట్టిస్తారా? అని బాబురావు ప్రశ్నించారు. పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికుల ఆందోళనకు దిగారు. వలస కార్మికులపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. లాఠీఛార్జ్‌ను అదునుగా తీసుకుని వలస కార్మికులపై స్థానికుల కూడా దాడి చేశారు. స్థానికుల దాడిలో వలస కార్మికుడి తలకు గాయమైంది.

Updated Date - 2020-05-17T21:02:35+05:30 IST