-
-
Home » Andhra Pradesh » cpm leader madhu vijayawada
-
సీపీఎం నేతల హౌస్ అరెస్ట్ దారుణం: మధు
ABN , First Publish Date - 2020-05-18T15:10:40+05:30 IST
సీపీఎం నేతల హౌస్ అరెస్ట్ దారుణం: మధు

విజయవాడ: లాక్‌డౌన్ వేళ విద్యుత్ ఛార్జీలు పెంచడం అమానుషమని సీపీఎం నేత మధు మండిపడ్డారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా జగన్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను కూడా రాష్ట్రం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.