సీపీఎం నేత బాబూరావు హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-18T13:59:32+05:30 IST

సీపీఎం నేత బాబూరావు హౌస్ అరెస్ట్

సీపీఎం నేత బాబూరావు హౌస్ అరెస్ట్

విజయవాడ: సీపీఎం నేత సీహెచ్ బాబూరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నోటీసులు అందజేశారు. ఆందోళనలో పాల్గొనడానికి వీల్లేదంటూ బాబూరావును హౌస్ అరెస్ట్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచి పైపెచ్చు దానికి నిరసన తెలియజేయడానికి ప్రజల హక్కు లేకుండా అరెస్టు చేయటం నోటీసులు జారీ చేయటం నిరంకుశత్వమని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలన్నారు పోలీసులు అణిచివేసినా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-18T13:59:32+05:30 IST