-
-
Home » Andhra Pradesh » CPI State Secretary Ramakrishna
-
ఉచిత ఇసుక విధానం అమలు చేయండి : సీపీఐ
ABN , First Publish Date - 2020-06-22T09:25:46+05:30 IST
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట్ర

అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఇసుకమాఫియా అక్రమాలు ఆగలేదన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే ప్రస్తుతం రూ.6వేలకు పెరిగిందన్నారు. మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోందని, నాసిరకం ఇసుక సరఫరా జరిగిందని స్వయానా మంత్రి విశ్వరూప్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, సాక్షాత్తూ వినుకొండ వైసీపీ ఎమ్మెల్యేనే ఇసుక అక్రమాలపై గళమెత్తారని రామకృష్ట్ర గుర్తు చేశారు.
పెట్రోల్‌పై నోరు మెదపరేమీ?
పెట్రో ధరల పెరుగుదలపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరుమెదపడంలేదని రామకృష్ణ ధ్వజమెత్తారు. మోదీ అంటే జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబులకు భయమేమో? అని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.