కరోనా వచ్చిన మంత్రులు హైదరాబాద్‌కు ఎందుకెళుతున్నారు?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-22T18:14:33+05:30 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

కరోనా వచ్చిన మంత్రులు హైదరాబాద్‌కు ఎందుకెళుతున్నారు?: రామకృష్ణ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 58,668కి చేరుకోగా మరణాలు 758 సంభవించాయన్నారు. ఒక్క వారం రోజుల్లోనే 25000 పాజిటివ్ కేసులు, 350 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీలో ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా చికిత్స కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ విమర్శించారు. 

Updated Date - 2020-07-22T18:14:33+05:30 IST