అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-13T21:38:50+05:30 IST

కృష్ణా నదీ జలాల విషయమై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన

అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి: రామకృష్ణ

అమరావతి: కృష్ణా నదీ జలాల విషయమై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు బుధవారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ ద్వారా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వీలైనంత ఎక్కువగా కృష్ణానది జలాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ఉన్న నీటి వినియోగ హక్కుల ప్రకారం రాయలసీమ జలాశయాలను నింపేందుకు చూడటం అభినందనీయం అని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ఆవశ్యకమని గతంలోనే ప్రభుత్వాలు సూచించాయని రామకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్న నేపథ్యంలో నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more